ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీలో రెండో సారి కూడా జగనే సీఎం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నా స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్ మోహన్ రెడ్డికే అవకాశం ఉందన్నారు.
ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెబుతున్నాయి అని వివరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జూన్ 04 తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. త్వరలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు.