జాతీయ బెస్ట్‌ ఫ్రెండ్‌ డే: మీ జీవితంలో నిజాయితీగా ఉండే ఫ్రెండ్‌ ఒక్కరైనా ఉన్నారా..?  

-

ప్రతి మనిషి తన జీవితంలో తనకు తాను ఏర్పరుచుకునే బంధం స్నేహం. అన్ని బంధాలు పుట్టుకతో వస్తే.. ఒక్క స్నేహ బంధం మాత్రం మనం ఏర్పరచుకుంటాం. ప్రతి ఒక్కరికి బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉండాలి. మన కష్టసుఖాలను పంచుకోవడానికి, కలిసి తిరగడానికి, మనకు సపోర్ట్‌ చేయడానికి ఇలా అన్నింటికి మనతో ఉండే తోడు నేస్తం. మంచి స్నేహితుడు పక్కన ఉంటే.. ఎంత పెద్ద కష్టమైన చిన్నగానే అనిపిస్తుంది. ఈరోజు నేషనల్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ డే. ఈ సందర్భంగా మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ గురించి మాతో షేర్‌ చేసుకోండి. అలాగే ఈరోజు వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం, జూన్ 8న జాతీయ బెస్ట్ ఫ్రెండ్ డేగా జరుపుకుంటారు. స్నేహం, సాంగత్యాన్ని జరుపుకోవడానికి జాతీయ బెస్ట్ ఫ్రెండ్ డేని జరుపుకుంటారు. 1935 సంవత్సరంలో, యునైటెడ్ స్టేట్ కాంగ్రెస్ స్నేహాన్ని మరియు దాని అందాన్ని జరుపుకోవడానికి ఒక రోజును ప్రకటించింది. ఆరుబయటకు వెళ్లేందుకు, ఆరుబయట కార్యకలాపాలు చేసేందుకు జూన్ 8 అనువైన సమయం కనుక జరుపుకునే రోజుగా జూన్ 8ని ఎంచుకున్నారు. త్వరలో, నేషనల్ బెస్ట్ ఫ్రెండ్ డే అనేక ఇతర దేశాలలో జరుపుకోవడం ప్రారంభమైంది.
ఈ ప్రత్యేకమైన రోజును గడపడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, మీ స్నేహితులను ఒకచోట చేర్చుకోవడం మరియు వారు మీ పట్ల ఎంత భావాన్ని వ్యక్తం చేస్తారో వారికి తెలియజేయడం. మీరు కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. స్నేహితుల సమూహం ఎక్కువగా ఆనందించే ప్రతిదాన్ని చేయవచ్చు. కుదరకపోతే.. కాల్‌ చేసి మనసారా మాట్లాడటం. మనకు మూడ్‌ బాలేకపోతే.. ఇష్టమైన స్నేహితులతో మాట్లాడితే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. నిజమైన నిజాయితి గల స్నేహితుడిని పొందడం అంటే ఎనలేని ఆస్తిని సంపాదించుకున్నట్లే.. కానీ ఈరోజు అలాంటి స్నేహం దొరకడం లేదు. మనతో అవసరం ఉన్నంత వరకే జనాలు సౌమ్యంగా ఉంటున్నారు. స్నేహం అనేది మోసపోవడానికి పెట్టుబడిలా మారింది. మనం ఒకరిని నమ్ముతాం.. ఆ నమ్మకమే వాళ్లను తప్పులు చేసేలే ప్రేరేపిస్తుంది. కల్మషం, కుళ్లు నిండిపోయిన ఈ సమాజంలో.. నిస్వార్థంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్లు, ఇష్టపడే వాళ్లు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. మీ జీవితంలో ఇప్పటికే ఉంటే.. వారిని అస్సలు వదిలిపెట్టకండి. మనుషులు పక్కన ఉన్నప్పుడు వారి విలువ తెలియదు. కానీ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వాళ్లు మనకోసం ఎంత చేశారో అని అప్పుడు అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news