టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయన కెరీర్ 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి, ఈ ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సూపర్ స్టార్, దాని తరువాత వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయనున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి.
కొద్దిరోజుల క్రితం ఒక సందర్భంలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, తన నెక్స్ట్ సినిమా దిల్ రాజు గారి బ్యానర్ పై ఉంటుందని, అలానే ఆ సినిమాలో మరొక్కసారి మహేష్ గారే హీరోగా నటిస్తారని వంశీ అన్నారు. ఇక దాని తరువాత మహేష్ నటించబోయే 28వ సినిమా కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. యువత అనే సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం ఆయిన పరశురామ్, ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక ల కలయికలో గీతగోవిందం సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. నాలుగు రోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో నాగచైతన్యతో తన తదుపరి సినిమాని ప్రకటించిన పరశురామ్, అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయబోతున్నట్లు నేడు ఒక సందర్భంలో వెల్లడించారు.
విశాఖపట్నం దగ్గరలోని అడివివరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా నిన్న దర్శించుకున్న పరశురామ్,.అక్కడి మీడియాతో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్‌తో అతి త్వరలో సినిమా చేయబోతున్నానని, ఆ సినిమాకు కథ కూడా సిద్ధంగా ఉందని చెప్పిన పరశురామ్, త్వరలో ప్రారంభం కానున్న నాగచైతన్య మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ సినిమాను ప్రారంభిస్తానని తెలిపాడు. దీనితో మహేష్ బాబుతో పరశురామ్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది…..!!