ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

-

ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నిన్న బీజేపీ ఎంపీలు ఆడిన డ్రామాలు చాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదన్నారు. కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా, ఆ పార్టీ ఎంపీలు ప్రధాని బదులుగా ఉక్కు శాఖ మంత్రినీ కలవడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ కోర్టు ఆదేశాలు పాటించాలి.. ప్లాంట్ అమ్మకుండా స్టేటస్ కో ఇచ్చింది అని, ఉత్తర్వులు ఇప్పుడే తనకు అందాయన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ, రాజమండ్రీ ఎం.పీ. పురంధేశ్వరి, సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వినతి పత్రం ఇవ్వడం డ్రామా యాక్టర్స్ ను తలపించారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్సింగ్ పై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ మాతోనే ఉన్నాడని మోదీ స్పీకర్ ఎన్నిక కోసమే వైసీపీకి మద్దతు పలికారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news