హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ వస్తే.. నగరమంతా ఇంకా అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల తాటి వనాలు తగ్గుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామన్నారు. రోడ్ల పక్కన వీటిని నాటాలనే నిబంధన విధిస్తామని పేర్కొన్నారు.
“పేదలకు కూడా కార్పొరేట్ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్ ఆలోచించింది. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చాం. కాంగ్రెస్ చేపట్టిన శంషాబాద్ ఎయిర్పోర్టు, ఓఆర్ఆర్ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగింది. నగర శివారు ప్రాంతం అయిన ఎల్బీనగర్-హయతనగర్ వరకు త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుంది” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాటమయ్య రక్షణ కవచం పనితీరును బుర్రా వెంకటేశం.. సీఎం కు వివరించారు.