పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాల్సిందే : కేటీఆర్

-

నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు బీఆర్ఎస్ నేతల బృందం మంగళవారం ఫిర్యాదు చేసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సభాపతి దృష్టికి తెచ్చామన్నారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్నారు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పును సభాపతి దృష్టికి తెచ్చామన్నారు.

తెలిపిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును స్పీకర్ కి చదివి వినిపించానని  కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యాయ్ పత్రం అంటూ మేనిఫెస్టో విడుదల చేసిందని అందులో స్పష్టంగా ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే ఇదే హస్తం పార్టీ కొట్లాడుతోందని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ రూ.50 కోట్లకు కొంటుందని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news