రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపే బడ్జెట్ ఇది అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పరిచింది. బడ్జెట్ లో కాంగ్రెస్ గ్యారంటీ హామీల ప్రస్తావన లేదన్నారు. ఎన్నికల్లో గ్యారెంటీ గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ అన్నారు. మహిళలందరికీ రూ.2500 ఇస్తామన్నారు. బడ్జెట్ లో దీని గురించి ప్రస్తావించలేదన్నారు.
పేదల ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదన్నారు. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న పెన్షన్ దారుల ఊసే లేదన్నారు. విద్యార్థులకు భరోసా.. స్కూటీలు, ప్రతీ విద్యార్థికి 10వేల లోపు ప్రకటిస్తామన్నారు. విద్యా భరోసా ప్రస్తావన లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా వారి గురించి పట్టించుకోలేదన్నారు. మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. వారి గురించి కూడా పట్టించుకోలేదు. చేనేత కార్మికులకు ఊరట కలిగించే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని.. పేర్కొనడం సిగ్గు చేటు అన్నారు.