ఓట్లకు ముందు అభయహస్తం.. ఓట్ల తరువాత శూన్య హస్తం : కేటీఆర్

-

ఓట్లకు ముందు అభయహస్తం.. ఓట్ల తరువాత శూన్య హస్తం అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పదో రోజు తెలంగాణ  అసెంబ్లీ సమావేశాలలో భాగంగా తాజాగా ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ  సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ సంపద పెరుగుతున్న రాష్ట్రం అన్నారు. తెలంగాణ వారికి పాలన సామర్థ్యం ఉందా అనే అనుమానాలు ఉండేవి. తెలంగాణ లో 4.1 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. తెలంగాణ భారతదేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ఒకటి. రాష్ట్రం పురోగతి విషయంలో మంత్రి శ్రీధర్ బాబు వాస్తవాలను బయటపెట్టారు. దేశానికి తెలంగాణ 5 శాతం జీడీపీ ఇస్తోంది. రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పని చేస్తుంది. 

స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకు తప్పకుండా సహకరిస్తాం. వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే.. హామీ పత్రాలకు పాతర. ప్రశ్నిస్తే.. దాడులు, ఆటో అన్నల ఆత్మహత్యలు. మూడు తిట్లు, ఆరు అబద్దాలతో కనిపిస్తున్నాయి. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషిస్తున్నాం. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళ తీసిందని ప్రచారం చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news