సిన్సియర్ ఆఫీసర్ ని ఏరికోరి తెచ్చుకున్న జగన్…!

-

అవినీతి విషయంలో సహించేది లేదని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల అవినీతి నిరోధక శాఖ ఏసీబీ పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో నెల రోజుల్లో మార్పు కనపడాలి అంటూ అధికారులను ఆదేశించారు. రెండు రోజులు కూడా గడవక ముందే ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్‌పై బదిలీ వేటు వేయడమే కాకుండా ఆయనను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

ఏసీబీ నూతన డీజీగా ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు నియమితులయ్యారు. కుమార్ విశ్వజిత్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఏసీబీ డీజీగా నియమితులవడంతో రవాణా శాఖ కమిషనర్‌గా ఎంటీ క్రిష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు.

వివాదాస్పద అధికారిగా సీతారామాంజనేయులుకి పేరుంది. గతంలో కొన్ని ఎన్కౌంటర్ల విషయంలో ఆయనకు కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విధి నిర్వహణలో మాత్రం ఆయన ఎక్కడా వెనక్కు తగ్గరు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఆయన గతంలో సీరియస్ గా వ్యవహరించడం, విజయవాడ కమీషనర్ గా కొంత మందికి చుక్కలు చూపించడంతో ఆయన్ను సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news