15 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు ఇది.. కానీ..?

-

సుప్రీం కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాము అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సంస్కృతి పరంగా కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చే కేసు ఇది. కానీ రాజకీయ నేతలు ఈ కేసులో వున్నారు కాబట్టే జైల్లో పెట్టారు అని అన్నారు.

అలాగే ఢీల్లి లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఒక్క రూపాయి రికవరీ చేయలేదు. లిక్కర్ పాలసీ నిర్ణయం పైన కేసులు పెట్టారు. సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారు. చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. స్త్రీలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆలస్యం అయినా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది అని వినోద్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news