రామ్మోహన్ నాయుడు వర్సెస్ విజయసాయి రెడ్డి…! ఆ క్రెడిట్ కోసం…!

-

పద్నాలుగు నెలల పాటు పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్ద సిక్కోలు మత్స్యకారులను భారత విదేశాంగ శాఖ అధికారులకు పాకిస్తాన్ అప్పగించింది. 2018 డిసెంబర్ లో పొట్టకూటి కోసం గుజరాత్ వెళ్ళి మత్స్యకారులు పాక్ కోస్టు గార్డులకు చిక్కారు. అప్పటి నుంచి వారిని కరాచిలోని లాండి జైల్లో అధికారులు ఉంచారు. దాదాపు 14 నెలల నుంచి,

వారు పాకిస్తాన్ చెరలోనే ఉన్నారు. ఇక అప్పటి నుంచి వారి కోసం వారి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ కి విజ్ఞప్తి చేసారు. తమ వారిని విడిపించాలని కోరారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ని కలిసారు. ఆ తర్వాత పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ని కూడా కలిసి విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు వీరు విడుదల కావడంతో క్రెడిట్ విషయంలో ఇద్దరు ఎంపీల మధ్య పోరు నడుస్తుంది.

వైసీపీ నేతలు, అభిమానులు ఏమో జగన్ చెప్పడంతో విజయసాయి రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని అనడం, తెలుగుదేశం సోషల్ మీడియా ఏమో రామ్మోహన్ నాయుడు విదేశాంగ శాఖను కలిసి ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారు. దీనితో ఇప్పుడు జాలర్ల క్రెడిట్ ఎవరిది అనేది స్పష్టంగా తెలియకపోయినా ఇద్దరు కలిసి కేంద్రంపై వేరు వేరుగా ఒత్తిడి చేసారు కాబట్టి కేంద్రానికి క్రెడిట్ ఇవ్వాలని, విదేశాంగ శాఖా మంత్రి విజయం ఇదని సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news