నా ఇంటికి వస్తే స్వాగతిస్తాను… కానీ కండువా కప్పుతా అంటే రావొద్దు – గాంధీ

-

నా ఇంటికి వస్తానంటే రండి సాదరంగా స్వాగతిస్తాను… కానీ పార్టీ కండువా కప్పుతా అంటే రావొద్దు అంటానని తెలిపారు ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో కార్యకర్తల సమావేశం ముగిసింది . ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు. కౌశిక్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తామన్నారు.

కెసిఆర్ హయం లో ఒక్క ఆందోళన లేకుండా పని చేసామని…ప్రాంతీయ విభేదాలు లేకుండా స్వేచ్ఛగా బతకాలని కెసిఆర్ చెప్పారన్నారు. మరి కౌశిక్… ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినపుడు అయన పై కెసిఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కౌశిక్ పై చర్యలు తీసుకోకపోతే మా అధ్యక్షుడు కెసిఆర్ తో నా సహచర ఎమ్మెల్యే లతో నేనే మాట్లాడతానని తెలిపారు. ఇది brs పార్టీకి కాంగ్రెస్ కి యుద్ధం కాదని… కౌశిక్ రెడ్డి కి గాంధీ కి మధ్య యుద్ధం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news