ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్ పై నెపం నెట్టడం న్యాయమా..? అంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. “అతి తెలివి మంత్రి గారు.. మీ లాజిక్ ప్రకారం.. మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీ లోనే ఉన్నాడా..? లేక కాంగ్రెస్ లో ఉన్నాడా ? సరే మీ మాటే నిజం అనుకుందాం. ఒక్క నిమిషం కోసం మరి మా BRS ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు అని ప్రశ్నించారు.
సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు ? అసలు చేర్చుకోవడం ఎందుకు..? ఆ తర్వాత పదవులు పోతాయి అనే భయంతో ఈ నాటకాలు ఎందుకు ? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. మీరు మీ అతి తెలివితో హైకోర్టు ను మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అని ట్వీట్ చేశారు కేటీఆర్.