ఈ రోజు చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా రిపోర్ట్ రిలీజ్

-

ఈ రోజు చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా రిపోర్టును రిలీజ్ చేశారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూకట్ పల్లిలోని నల్లచెరువు సర్వే నెం. 66, 67, 68, 69లోని అనధికారికంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశాం. 16 కమర్షియల్ షెడ్లు, ప్రహారి గోడల కూల్చివేత కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలో 4 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నాం. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు సర్వే నెం.164లో మూడు భవనాలు కూల్చివేత,
వాణిజ్య పరంగా వాడుతున్న ఐదు అంతస్తుల భవనాలు కూల్చివేశాం అని తెలిపారు.

కిష్టారెడ్డిపేట లో ఒక ఎకరం ప్రభుత్వం స్థలం స్వాధీనం చేసుకున్నాం. అలాగే పటేల్ గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన నిర్మాణాలు తొలగించాం. సర్వే నెం. 12/2, 12/3 లోని 25 నిర్మాణాల కూల్చివేశాం. పటేల్ గూడలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నాం. మూడు ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాలు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోవడం జరిగింది. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నాం. నివాసం కోసం నిర్మించుకున్న భవనాలను కూల్చివేయలేదని, వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే తొలగించినట్టు తెలిపారు హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news