కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.. బండి సంజయ్ ఎమోషనల్ ట్వీట్..!

-

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఇవాళ. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషిని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. రాజకీయ వేత్తగా, బహుభాష కోవిధుడిగా బాపూజీ చూపిన మార్గం అందరికీ ఆదర్శం అనే చెప్పాలి. 

ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తెలంగాణను తెలంగాణకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు బాపూజీ అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం లెక్క చేయని త్యాగధనుడు అతనొక్కడే అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మ గౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడుకి నమస్సుమాంజలులు” అంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news