అమ్మకానికి 7 నెలల చిన్నారి.. ఐదుగురిపై కేసు!

-

నెలలు నిండని చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. కొంతమంది దుండగులు 7 నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టడంతో ఆర్మూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు శనివారం రాత్రి తెలిపారు. వారి కథనం ప్రకారం..నందిపేట్ మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి-పోశెట్టి దంపతులకు 7నెలల చిన్నారి ఉంది.

వారం కిందట రూ.30 వేలకు పెర్కిట్‌కు చెందిన షేక్ హబీబి- మహమ్మద్ గౌస్ దంపతులకు ఆ చిన్నారిని అమ్మినట్లు తెలిసింది. మైనార్టీ దంపతులకు పిల్లలు లేకపోవడంతో చిన్నారిని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని ఆర్మూర్ ఎస్సై గంగాధర్ చెప్పారు.ఈ ఘటనపై సమాచారం రాగానే ఆర్మూర్ ఏఎస్ఐ లక్ష్మణ్ విచారణ జరిపి కేసు నమోదు చేశారన్నారు. చిన్నారిని కొన్నవారి నుంచి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న ఐసీడీఎస్ బాలల కేంద్రంలో అధికారుల సంరక్షణలో ఉంచినట్లు తెలిపారు. చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news