కౌలు రైతుల చట్టాల పై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష..!

-

కలెక్టరు కార్యాలయంలో కౌలు రైతుల చట్టం పై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేసారు. 1956 లోనే కౌలు రైతుల చట్టం తీసుకుని వచ్చారు. 2011 లో కౌలు రైతుల చట్టం లో అనేక మార్పులు చేశారు, దీన్ని వల్ల సమస్యలు వచ్చాయి. గత ఐదేళ్ల కాలంలో కౌలు రైతులు ఇబ్బందులు పడ్డారు, కౌలు కార్డులు ఎవరికి ఇవ్వలేదు అని అన్నారు.

అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి చట్టం చేయడం కాకుండా రైతులు, కౌలు దారుల తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 7 ప్రాంతీయ సదస్సులు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టం రూపకల్పన చేస్తాం అన్నారు. ఇక ఇందులో భాగంగానే తొలి ప్రాంతీయ సదస్సు గుంటూరు లో పెట్టాం. అందరికీ ఆమోదయోగ్యమైన, ప్రయోజనకరమైన కౌలు చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news