తెలంగాణాలో బలపడేందుకు బిజేపీ శ్రమిస్తోంది.. ఓ వైపు అధికార పార్టీ మీద సమర శంఖం పూరిస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టింది.. ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా ఉండటంతో.. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విసృతంగా నిర్వహిస్తూ.. జనాల్లోకి వెళ్తున్నారు.. ఈటెల, కిషన్ రెడ్డి, సంజయ్ వంటి సీనియర్లు బీఆర్ఎస్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ పొలిటికల్ మైలేజ్ ను సంపాదించుకుంటున్నారు..
దేశ వ్యాప్తంగా బిజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఏపీలో, తెలంగాణాలో ఈ కార్యక్రమాన్ని అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పార్టీకి ఓటేసి వారిని.. పార్టీ పథకాలపై ఆకర్షితులైన వారిని పార్టీలోకి తీసుకుని.. సభ్యత్వం చేయించేందుకు రెండు రాష్టాలకు చెందిన ముఖ్యనేతలు, ఇన్చార్జులు కృషి చేస్తున్నారు.. అయితే తెలంగాణలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదట్లో కాస్త నెమ్మదిగా జరిగింది.. కొందరు నేతలు దీన్ని లైట్ తీసుకున్నారు.. దీంతో అధిష్టానం సీరియస్ అయ్యింది.. గత ఎన్నికల్లో భారీ ఓటు షేర్ ను సాధించామని.. అందుకు అనుగుణంగా 50లక్షల సభ్యత్వాలు చెయ్యాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో నేతలు గ్రౌండ్ లెవల్ లో విసృతంగా తిరుగుతున్నారు..
టార్గెట్ రీచ్ అవ్వకపోతే.. ఎక్కడ హైకమాండ్ కోపాన్ని చూడాల్సి వస్తుందేమోనని భయంతో.. తెలంగాణ బీజేపీ నేతలు కష్టపడుతున్నారు.. సభ్యత్వ నమోదు టార్గెట్ కొండంత ఉంటే.. గ్రౌండ్లో మాత్రం గోరంత పనే జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది.. దీంతో ఎలాగైనా టార్గెట్ రీచ్ అయ్యేందుకు కమలం పార్టీ నేతలు కొత్త దారులు వెతుక్కుంటున్నారట. ఇదేసమయంలో నెలాఖరు వరకు గడువు పొడిగిస్తూ అధిష్ఠానం కూడా మరో చాన్స్ ఇచ్చింది. దీంతొ నేతలు విసృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..
సెప్టెంబర్ 8న రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం షురూ అయింది. అయితే తొలుతా నేతలు సభ్యత్వాల మీద దృష్టి పెట్టలేదు.. అధిష్టానం అక్షింతలు వెయ్యడంతో కీలక నేతలు కష్టపడి సభ్యత్వాలు చేయిస్తున్నారు.. ఇప్పటికే మెంబర్షిప్ డ్రైవ్ కోసం రెండు సార్లు గడువు పెంచి.. ఈనెలాఖరు వరకు డెడ్లైన్ విధించారు ఢిల్లీ పెద్దలు. ఎంత కష్టపడుతున్నా.. సభ్యత్వాలు 25లక్షలకు మించి అవలేదని తెలుస్తోంది.. మరి నేతలు టార్గెట్ ను ఎలా రీచ్ అవుతారో చూడాలి.