భారత్ ఎప్పటికీ యుద్దానికి మద్దతు ఇవ్వదు.. దౌత్యానికి సహకరిస్తాం : ప్రధాని మోడీ

-

భారత్ ఎప్పటికీ యుద్దానికి మద్దతు ఇవ్వదని.. వివాదాస్పద సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యానికి సహకరిస్తుందని తెలిపారు ప్రధాని మోడీ.  16వ బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్లీనరీ సెషన్ లో మాట్లాడారు ప్రధాని మోడీ. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్దం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్-హమాస్, హిజ్బుల్లా సంస్థల మధ్య ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొనన ఉద్రిక్తతల పై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

కరోనా మహమ్మారి వంటి భీకర సవాల్ ను కలిసికట్టుగా ఎదుర్కొన్ననట్టు భావి తరాలకు సంపన్న భవిష్యత్ ను అందించే సామర్థ్యాలు మనకున్నాయి. సైబర్ సెక్యూరిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనల కోసం పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహకారం పై బ్రిక్స్ దేశాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఉగ్రవాదం వంటి తీవ్ర సమస్యలపై ద్వంద వైఖరి సరికాదన్నారు. మన దేశాల్లో యువత ఉగ్రవాదం బాట పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఐక్యరాజ్యసమితిలో పెండింగ్ లో ఉన్న ఉగ్రవాద అంశం పై పని చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news