నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అరెస్ట్..!

-

రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లకు సంబంధించిన కుటుంబాలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా  బెటాలియన్ కానిస్టేబుళ్లకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నల్గొండ నియోజకవర్గం అన్నెపర్తి లోని 12th బెటాలియన్ లో ఎక్ పోలీస్ వ్యవస్థను అమలు చేయాలని, ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్ల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలపడానికి వెళ్లారు. 
నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిలను అడ్డుకున్న పోలీసులు. బెటాలియన్ లోపటికి వెళ్లకుండా గేటు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడ్డారు భూపాల్ రెడ్డి. తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన బెటాలియన్ కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయడం అమానుషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు భూపాల్ రెడ్డి. ఆయనను అరెస్ట్ చేసి నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news