కేసీఆర్ కు నీకు పోలికనా ?…కేసీఆర్ లేకుంటే తెలంగాణే లేదు – హరీష్‌ రావు చిట్‌ చాట్‌

-

కేసీఆర్ కు నీకు పోలికనా ?…కేసీఆర్ లేకుంటే తెలంగాణే లేదు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి చురకలు అంటించారు హరీష్‌ రావు. చిట్‌ చాట్‌ లో హరీష్‌ రావు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డికి సీఎం పదవీ కెసిఆర్ పెట్టిన భిక్ష అన్నారు. కేసిఆర్ కు నీకు పోలికనా ? కేసిఆర్ లేకుంటే రాష్ట్రమే లేదని తెలిపారు. కేసిఆర్ లేకుంటే ఉద్యమమే లేదని మీడియాతో హరీష్ రావు చిట్ చాట్ లో పేర్కొన్నారు.

నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారు….అలా మాట్లాడిన వాళ్ళు ఎటు పోయారో చూశామని హెచ్చరించారు. ముందు నీ పక్కన ఉన్నవాళ్లు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో అంటూ చురకలు అంటించారు. ఈ రోజు ఎన్నికలు వస్తే 100 సీట్లు brs కు వస్తాయని తెలిపారు. ఓ మంత్రి గవర్నర్ ను కలిశాడు.. ఓ మంత్రి హెలికాప్టర్ లేదని అలిగాడు అంటూ సెటైర్లు పేల్చాడు. ఓ మంత్రి ఢిల్లీ కి రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్ళాడు, మరో ఇద్దరు ముగ్గురు మేము సీఎం అవుతాము అని సోషల్ మీడియా లో పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news