సరోజినీ కంటి ఆసుపత్రికి జనాలు క్యూ..బాణసంచా కాలి గాయపడిన 48 మంది !

-

మెహిదిపట్నం సరోజినీ కంటి ఆసుపత్రి కిట కిట లాడుతోంది. సరోజినీ కంటి ఆసుపత్రికి జనాలు క్యూ కడుతున్నారు. దీపావళి బాణసంచా కాలుస్తూ గాయపడిన 48 మంది సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 9 మందికి సీరియస్ గా ఉందట. సరోజిని దేవి కంటి ఆసుపత్రి లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

sarojini eye hospital

అటు 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. 9 మంది కి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే జరిగాయి. సరోజినీ ఐ హాస్పిటల్ డాక్టర్ సౌమ్య..ఇదే అంశంపై మాట్లాడుతూ… దీపావళి బాణసంచా కాలుస్తూ చాలా మంది గాయపడి సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారన్నారు. ఇందులో 9మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు. 9మందికి శస్త్ర చికిత్స అవసరం లేదని… 9 మంది ని అబ్జర్వేషన్ లో పెట్టాము వారికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తామని తెలిపారు. 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయని..వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news