సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి తీరును ప్రజలందరు గమనిస్తున్నారు. నీ పుట్టిన రోజున తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద, నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. నీ లాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదు అని హరీష్ రావు అన్నారు.
మూసీ నీళ్ళ మురికితో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ వంకర బుద్ధి ఇగ మారదు. నీ లాగా చిల్లరగా మేము మాట్లాడలేము. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన గంభీరమైన చరిత్ర మాది. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీది. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజా క్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతం. పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టు. నిరంకుశత్వం మాని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ద వహించు అని రేవంత్ కు హరీష్ రావు సూచించారు.