సీఎం సొంత నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అని BRS ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అనారోపించారు. గత 9 నెలలుగా తమ భూములు ఫార్మా సిటీ కోసం ఇవ్వమని లగచర్ల రైతులు నిరసనలు తెలుపుతున్నారు. భూములు ఇవ్వం అన్నందుకు అర్ధరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్ నెట్ బంద్ చేసి మహిళలను బూతులు తిడుతూ కొట్టారు అని తెలిపారు.
అలాగే ఇక్కడ 51 మంది అమాయక రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. ఇక రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తూన్నాడు. రైతులు.. తమపై మళ్లీ దాడి చేయిస్తారోనని ఇప్పటికీ భయపడుతున్నారు అని ఆమె తెలిపారు. అయితే లగచర్ల బాధితులకు, గిరిజన బిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ అండగా జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్ తో పాటు రాష్ట్రపతిని కూడా కలిసి గిరిజనుల కోసం పోరాడతాం అని సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు.