ఉమ్మడి పాలన కంటే.. కేసీఆర్ పాలనలోనే నల్గొండకు నష్టం : సీఎం రేవంత్ రెడ్డి

-

ఉమ్మడి పాలన కంటే.. కేసీఆర్ పాలనలోనే నల్గొండకు నష్టం జరిగిందని  సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన గంధంవారిగూడెంలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నల్గొండ జిల్లా పాత్ర మరువలేనిదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్ చారిది నల్గొండ జిల్లానే అన్నారు. నల్గొండ జిల్లాలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకొస్తుందని తెలిపారు.

CM Revanth Reddy
CM Revanth Reddy

నల్గొండకు కృష్ణాజలాలు వస్తే.. ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారు. కానీ పాలించిన పదేళ్లు నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నేతలు నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తాను హామీ ఇస్తున్నా.. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసేందుకు ఎంతైనా ఖర్చు చేస్తాన్నారు. గతంలో వరి పంట వేస్తే.. ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ అన్నారు. కానీ తాము వరి పంటకు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తాము ఓడిపోయినా కూడా ఏనాడు ఇంట్లో కూర్చోలేదని సంవత్సర కాలంగా కేసీఆర్ ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news