కానిస్టేబుళ్ల కుటుంబాలను ఆదుకుంటాం.. మంత్రి పొన్నం భరోసా

-

రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ కానిస్టేబుల్స్ మరణించిన ఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ ఘటన పై స్పందిస్తూ.. ఇంత చిన్న వయస్సులో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆ కానిస్టేబుల్స్ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయారని వారికి ఆ దేవుడే ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరూ కానిస్టేబుల్స్ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు, గాడిచర్లపల్లి గ్రామాలకు చెందిన వెంకటేష్, పరందాములు దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా.. గజ్వేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరూ కానిస్టేబుల్స్ అక్కడికక్కడే మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news