కేటీఆర్ కి మంత్రి కొండా సురేఖ కౌంటర్..!

-

బీజేపీ  గెలుపుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నే అతిపెద్ద కార్యకర్త అంటూ..ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు ఆయనకు అభినందనలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన  వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ నుంచి ఇలాంటి ప్రకటన ఆశ్చర్యంగా ఉందని.. మీ పార్లమెంటరీ ప్రాంతం కరీంనగర్ లోక్ సభ స్థానంలో బీజేపీ రెండుసార్లు గెలిచిందని.. అలాగే మీ సోదరి కవిత నిజామాబాద్ లో 2019ఎన్నికల్లో ఓడిపోయిందన్న సంగతి మరువరాదన్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని, మీరు చేయవలసిన మొదటి పని మీ “మోడీ అంకుల్” గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు మీ సోదరిని అభినందించడమని..ఎందుకంటే ఈ ఫలితాన్ని రూపొందించడంలో ఆమె చేసిన ప్రయత్నాలు స్పష్టంగా ఉన్నాయని.. అది అంగీకరించడం న్యాయంగా ఉంటుందంటూ పరోక్షంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను గుర్తు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల్లో రాజ్యాంగానికి మించిన వారు ఎవరూ లేరని మోదీకి అర్ధమయ్యేలా చేశారన్నారు.  పార్లమెంటు ఎన్నికలలో సున్నా సీట్లతో మీ పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని మంత్రి సురేఖ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news