ఇలాంటి వాళ్ళే జగన్ పరువు తీస్తోంది ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర అప్పుల ఊబిలో ఉన్న ఒకపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాల విషయంలో ఖర్చులు తగ్గించుకుంటూ పరిపాలిస్తున్న వైయస్ జగన్ దేశంలోనే నాల్గవ అత్యంత బెస్ట్ సీఎం గా ఇటీవల పేరు సంపాదించుకున్నారు. అధికారంలోకి వచ్చి కేవలం ఏడు నెలలుగా కావచ్చిన క్రమంలో జగన్ కి నాలుగో స్థానం రావడంతో జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇదే తరుణంలో రాష్ట్రంలో జగన్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషంగా జగన్ పరిపాలన బాగుందని కామెంట్ చేస్తున్నారు.

Image result for jagan mlas in assembly

అన్ని రకాలుగా బాగున్నా గాని సొంత పార్టీలో ఉన్న కొంతమంది నేతలు మీడియా ముందు వ్యవహరిస్తున్న తీరు జగన్ పరువు తీసే విధంగా మారుతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ మొత్తం శాసన మండలి రద్దు అనే అంశం చుట్టూ తిరుగుతోంది. శాసన మండలి రద్దు చేయటం ఏపీ ప్రభుత్వం చేతిలో లేదని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కామెంట్ చేస్తుంది. అయితే మరోపక్క సీఎం జగన్ అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లుకు ఆమోదం అయ్యేలా వ్యవహరించి బిల్లును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

 

ఇటువంటి కీలక సమయంలో వైసీపీ పార్టీకి చెందిన నేత రవిచంద్రారెడ్డి…చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వాన్ని పరువు తీసే విధంగా చేశాయి. ప్రస్తుతం మండలి రద్దుకు కేంద్రం ఆమోద ముద్ర వేయాలి.. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత గెజిట్‌ విడుదలవ్వాలి. కానీ, మండలి అప్పుడే రద్దయిపోయిందని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి కామెంట్లు చేయటంతో ఏపీ మీడియాలో మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలోనే వైసీపీ నేత రవి చంద్ర రెడ్డి కి ‘ఫ్యాక్షనిస్ట్’ ముద్ర ఉండటంతో ఇటువంటి సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో సొంత పార్టీ నేతలే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏం వివరణ ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నట్లు అంతా బాగున్నా గాని ఇలాంటి వాళ్ళే జగన్ పరువు పోతుందని బాధపడుతున్నారట. 

Read more RELATED
Recommended to you

Latest news