షాహిద్ లో నాకు ఆ కిక్కు కనిపించలేదు అందుకే నో చెప్పా ..ఏ కిక్కు కావాలి రష్మిక ..?

-

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా ఇక్కడ నానీ కి మంచి పేరు తెచ్చింది. కమర్షియల్ గా అంత సక్సస్ కాకపోయినప్పటికి నాని కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం అల్లు అరవింద్-దిల్ రాజు బృందం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు వర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. షాహిద్ కి జంటగా మృనాల్ టక్కర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు మేకర్స్. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 

అయితే వాస్తవంగా ఈ సినిమాలో ముందుగా షాహిద్ కు జంటగా గా కన్నడ బ్యూటి, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందనను అనుకున్నారు. అరవింద్- దిల్ రాజు సలహా మేరకు గౌతమ్ రష్మికను ఎంపిక చేసారు కూడా. ఇక రష్మిక కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందని…బాలీవుడ్ లో మంచి సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అది నిజం కూడా అయింది. కానీ తర్వాత వెంటనే ఈ రీమేక్ నుంచి రష్మిక తప్పుకుంది. ఇందుకు కారణం తెలుగులో ఉన్న క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని రష్మిక భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని.. అందుకే అరవింద్ డ్రాప్ చేశాడని అన్నారు. అయితే ఇందుకు సంబంధించి తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. పారితోషికం కారణం కాదని.. కేవలం డేట్లు అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నానని రష్మిక తెలిపింది.

సోషల్ మీడియా లో వచ్చిన వార్తలన్ని పుకార్లేనని ఖండించింది. గతంలో అల్లు అరవింద్ గారి బ్యానర్లో గీత గోవిందం లాంటి సినిమాలు చేసి సక్సెస్ అయ్యాను. నాకు హీరోయిన్ గా అవకాశాలు కల్పించిన వారు. జెర్సీ ఛాన్స్ వస్తే ఎలా మిస్ చేసుకుంటాను…కేవలం డేట్లు అడ్జస్ట్ కాకే తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం బన్నీతో కలిసి కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నానంటూ తన కొత్త ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్ ఇచ్చింది. అయితే కొంతమంది నెటిజెన్స్ మాత్రం నాని అంత కెపాసిటి షాహిద్ కి లేదని అందుకే రష్మిక ఒప్పుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం రష్మిక …!

Read more RELATED
Recommended to you

Latest news