గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెరైటీ స్ట్రాటజీని ఫాలో అయ్యేవాళ్ళు. టిడిపి ప్రభుత్వం ఏదైనా పని తలపెడితే ఆ పనికి ఏదైనా సమస్య గాని మరియు నింద గాని అపవాది గాని వచ్చిన వెంటనే చంద్రబాబు..జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని జగన్ నిందలు వేసేవారు. దాదాపు చంద్రబాబు తన పరిపాలన అంతా తాను ఏం చేసాడో కాకుండా..ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రతి విషయంలో అడ్డుపడుతున్నాడని ఆరోపణలు చేస్తూ వచ్చారు. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు గతంలో చెప్పినట్లు వైసీపీ పార్టీలో ఉన్న మంత్రులు వ్యవహరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక రంగాలు తీసుకురావటానికి అనేక ఇబ్బందులు పడే వాళ్లు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో చాలా సమావేశాలు పెట్టిన వాస్తవాలు గ్రౌండ్ అయినవి చాలా తక్కువ. దీంతో టిడిపి నాయకులు మంత్రులు అనేక విధాలుగా మాయ చేస్తూ గడిపారు. ఏ విషయంలో తమ వైఫల్యం బయటపడిపోయినా కూడా.. జగన్మోహనరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రం గురించి దుష్ప్రచారం చేయడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదని చంద్రబాబు సర్కార్ అప్పట్లో ఆరోపించే వాళ్లు. సరిగ్గా ఇప్పుడు ఇదే విధంగా వైసీపీ పార్టీలో ఉన్న మంత్రులు ముఖ్యంగా గౌతంరెడ్డి ప్రతి చిన్న విషయానికి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పై ఆరోపణలు చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర ఐటీ రంగం గురించి మంత్రి గౌతం రెడ్డి మాట్లాడిన సందర్భం లో…చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వలన రాష్ట్రంలో ఐటీ రంగం స్తబ్దత నెలకొందని వ్యాఖ్యలు చేశారు. చాలా విషయాలలో పారిశ్రామిక రంగం గురించి గౌతంరెడ్డి చంద్రబాబు వల్లే పెట్టుబడులు ఏపీకి రానట్టు మాట్లాడారు. దీంతో గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విన్న చాలామంది రాజకీయ మేధావులు గత ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్టే ప్రస్తుతం వైకాపా మంత్రులు నడుచుకుంటున్నారని పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా చూపించాలి కదా అంటూ విమర్శలు చేస్తున్నారు.
దీంతో ఈ వార్తలు ఎక్కువ రావటంతో వైకాపా మంత్రులు అనుసరిస్తున్న విధానానికి జగన్ కె బిగ్ షాక్ తగిలినట్లు పార్టీలో వినబడుతున్న టాక్. ముఖ్యంగా ప్రతి మీడియా సమావేశానికి మంత్రులు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు అన్న వాదన ప్రజల్లో బాగా వినబడుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.