నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు కూడా అదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.150 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,650 నుంచి రూ.39,800కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైపైకి చేరింది. రూ.260 పరుగులు పెట్టింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.43,160 నుంచి రూ.43,420కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం ఉన్న చోటునే ఉంది. స్థిరంగా కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.49,900 వద్దనే నిలకడగా ఉంది.
ఈ రెండు రోజుల్లో ధర ఏకంగా రూ.780 పెరగడం గమనార్హం. అలాగే ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.41,850కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,650కు ఎగసింది. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం ఉన్న చోటునే ఉంది. స్థిరంగా కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.49,900 వద్దనే ఉంది.