భూభారతి పోర్టల్ ను రైతులకు చేరువ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పై కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. రేపటి నుంచి జూన్ 02 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పర్యటించేలా కార్యచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. గతంలో రూ.2కే కిలో బియ్యంతో పాటు ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు.
భూ భారతి పోర్టల్ ను రైతులకు మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించామని కామెంట్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. ఎస్సీ ఉపకులాలకు చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ పథకాలతో ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని.. వర్గీకరణ వాకి ఓ గుదిబండలా మారిందన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోందని తెలిపారు.