హ్యాండ్‌ షేక్‌, ముద్దులు వద్దు.. నమస్తే పెట్టండి.. చాలు..!

-

సాధారణంగా మనం ఒకరికొకరం పరిచయం చేసుకున్నప్పుడు లేదా స్నేహితులను, ఇతరులెవరినైనా కలిసినప్పుడు సహజంగానే షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటాం. ఇక కొందరు పలకరింపుకు తోడు ముద్దులు పెట్టుకుంటారు. అయితే ఈ రెండింటినీ మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అవును.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఆ రెండు పద్ధతులను మానేయాలని, కేవలం నమస్తే పెడితే చాలని వైద్యులు సూచిస్తున్నారు.

no shake hands and kisses only namasthe please

చైనాలో ఇప్పటికే ఒకరికొకరు గ్రీట్‌ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ షేక్‌ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఫ్రాన్స్‌లో పలకరింపు ముద్దులు పెట్టుకోకూడదని చెబుతున్నారు. ఇక బ్రెజిల్‌లో పౌరులు తాము వాడే స్ట్రాలను మరొకరితో షేర్‌ చేసుకోకూడదని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

జర్మనీలో షేక్‌ హ్యాండ్‌ చేసుకోకూడదని హెచ్చరికలు జారీ చేశారు. స్పెయిన్‌లోనూ పలకరింపు ముద్దులను నిషేధించారు. ఇక రొమేనియా, పోలాండ్‌, ఇరాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌, యూఎస్‌ఏ తదితర దేశాల్లోనూ షేక్‌ హ్యాండ్‌లు ఇచ్చుకోరాదని, పలకరింపు ముద్దులు పెట్టుకోరాదని సూచిస్తున్నారు. కనుక ఎవరైనా సరే.. షేక్‌ హ్యాండ్‌లు ఇచ్చుకోకుండా ఉంటే చాలు.. అంతగా పలకరించాలంటే.. నమస్తే పెట్టండి.. సరిపోతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news