ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ కు చిన్న షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న నేపధ్యంలో నియోజకవర్గ బాధ్యతలను మరో కీలక నేతకు అప్పగించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు మరో పది రోజుల్లో రానున్నాయి. నోటిఫికేషన్ కూడా ఎన్నికల సంఘం జారీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కనీసం గెలిచిన 23 నియోజకవర్గాల్లో అయినా గెలవాలని భావిస్తుంది.
అలాగే గెలిచిన మూడు ఎంపీ స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ కీలక నేతలకు కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాజకీయంగా బలపడాలి అంటే స్థానిక సంస్థలు చాలా కీలకమని చెప్పారు. దీనితో చంద్రబాబు ఆదేశాలతో నాయకులు అందరూ ఇప్పుడు నియోజకవర్గాలలో కష్టపడుతున్నారు. ఈ తరుణంలో అందుబాటులో ఉండే నేతలకు చంద్రబాబు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే హిందూపురం నియోజకవర్గంలో బాధ్యతలను ఒక కీలక నేతకు అప్పగించారు.
పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ ఎలాగూ బిజీ గా ఉన్నారు కాబట్టి ఆయన స్థానిక నాయకులతో టచ్ లో ఉండే అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ నేతలను మార్చడానికి చంద్రబాబు సిద్దమయ్యారు. అందుబాటులో ఉండే వారికే అవకాశం ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు ఆయన.