భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. భర్త ఆమె తల నరికాడు..!

-

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. తాళి కట్టిన చేతితోనే భార్య తన నరికేశాడు ఓ వ్యక్తి. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని తల నరికి.. ఆ తలను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. రాయచోటి సంబేపల్లె మండలం వడ్డెపల్లెకు చెందిన 40 ఏళ్ల వెంకటరమణకు అదే ఊరుకు చెందిన 32 ఏళ్ల రాణితో 18 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీళ్లిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మధ్యలో వెంకటరమణ గల్ఫ్ కు వెళ్లి వచ్చాడు. అయితే.. వెంకటరమణ గల్ఫ్ కు పోయిన సమయంలో రాణి.. తన ఇంటి పక్కనే ఉండే నాగేశ్వరరావుతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం రాణి బంధువులకు తెలియడంతో ఇంకోసారి అటువంటి పని చేయొద్దని రాణిని మందలించారు. వెంకటరమణ గల్ఫ్ నుంచి కడప వచ్చాక అతడిని కూడా భార్య అక్రమ సంబంధం విషయం తెలిసింది. కానీ.. పెద్దలు నచ్చజెప్పడంతో వెంకటరమణ కూడా భార్యను ఏమనలేదు. ఇటీవల తన కొడుకుల్లో ఒక కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో భార్యే తన కొడుకును హతమార్చిందని అనుమానం పెంచుకున్నాడు వెంకటరమణ.

మధ్యలో మరోసారి కువైట్ వెళ్లాడు. అక్కడి నుంచి పంపించిన డబ్బుల లెక్క గురించి సరిగా రాణి చెప్పక పోవడం.. చేసిన అప్పులు అలాగే ఉంటుండటంతో వెంకటరమణ తిరిగి భారత్ వచ్చేశాడు. అయినప్పటికీ తన ప్రియుడితో ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నది. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటరమణ.. నిన్న ఇద్దరు బైక్ పై వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భయపడ్డ ప్రియుడు అక్కడి నుంచి పరారి కాగా.. వెంకటరమణ భార్య జుట్టు పట్టుకొని పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోసి చంపాడు. అనంతరం తలను వేరు చేసి తల పట్టుకొని సంబేపల్లె పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news