మహేష్ బాబు ఆ ఉచ్చులో ఇరుక్కున్నాడా .. నమ్రత తప్ప ఇంకెవరు బయటికి లాగలేరా ..?

-

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అన్న బిరుదు కృష్ణ గారికి ఆ తర్వాత మహేష్ బాబుకే సాధ్యమైంది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడమే ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఉన్న భారీ రేస్ లో ముందు వరుసలో ఉండి తండ్రికి ఉన్న బిరుదుని దక్కించుకున్నాడంటే మహేష్ బాబు కి ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ గాని ఆయన క్రేజ్ గాని ఎంతటిదో అందరికి తెలిసిందే. అంతేకాదు మహేష్ బాబు మొదటి నుంచి తండ్రి కృష్ణ గారి మాదిరిగా దర్శకుల, నిర్మాతల హీరో అని అంటారు. ఏ సినిమా అయిన ఒకసారి కమిటయ్యాడంటే ఆ సినిమాని బాధ్యతగా తీసుకోవడం మహేష్ బాబు కి ఉన్న గొప్ప గుణం.

 

అయితే గత కొంత కాలంగా మహేష్ కోసం ఎదురు చూసే స్టార్స్ డైరెక్టర్స్ ఒక్కోక్కరిగా మహేష్ బాబు కు దూరం అవుతున్నారని ఇండస్ట్రీలో కొంతకాలంగా టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అతడు బ్లాక్ బస్టర్ అవగా ఖలేజా యావరేజ్ గా మిగిలింది. అయితే మళ్ళీ ఈ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాని అనూహ్యంగా మహేష్ బాబు నుంచి త్రివిక్రమ్ దూరమయ్యారు. ఆ తరువాత సుకుమార్, పూరి జగన్నాధ్ లను మహేష్ బాబు పట్టించుకోకపోవడంతో.. ఈ ఇద్దరు దూరం అయ్యారు. వాస్తవానికి ఈ స్టార్ డైరెక్టర్స్ ఇద్దరు మహేష్ బాబు తో సినిమా చేయాలని చాలా వేయిట్ చేశారు. కానీ ఎందుకనో మహేష్ బాబు ఛాన్స్ ఇవ్వలేదు.

ఇక మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి, కొరటాల శివ మాత్రమే మహేష్ కి కాస్త దగ్గరగా ఉన్నారు. అయితే రాజమౌళి మహేష్ బాబు తో సినిమా ఎప్పుడుంటుందో తెలీదు. ఇక మిగిలింది కొరటాల శివ మాత్రమే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కంప్లీట్ గా కొత్త దర్శకులతో సినిమా చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. అనిల్ రావిపూడి లాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్స్ టాలీవుడ్ లో లేరన్న సంగతి తెలిసిందే. ఇక తమిళ దర్శకులటే మురుగదాస్ వంటి డైరక్టర్స్ కూడా భారీ డిజాస్టర్ ని ఇచ్చాడు. ఇక అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి మాస్ డైరెక్టర్స్ కి మహేష్ బాబు ఎంతమాత్రం ఛాన్స్ ఇవ్వరు. అయితే త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు మహేష్ బాబు కి దూరమవడానికి ఆయన కి ఉన్న పర్సనల్ టీం అట. మరి ఈ విషయంలో నమ్రత కలగజేసుకుంటే మహేష్ బాబు కి డైరెక్టర్స్ కి గ్యాప్ తొలగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news