బిగ్ బ్రేకింగ్; టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో తాజాగా ఆ పార్టీకి ఊహించని విధంగా రాజకీయంగా బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీ దిమ్మ తిరిగే షాక్ లు ఇస్తున్నారు. ఏళ్ళ తరబడి పార్టీలో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి టీడీపీ ని వీడి వైసీపీలోకి చేరే అవకాశం కనపడుతుంది. ఆయన మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మంచి పేరుంది.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రామసుబ్బారెడ్డి టీడీపీని వీడతారనే ప్రచారం జరిగింది. ఆయన వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగింది. అమెరికా పర్యటనలో ఉన్న జగన్‌తో ఎయిర్‌పోర్ట్‌లో రామసుబ్బారెడ్డి కరచాలనం ఆ తర్వాత వేసిన కుశల ప్రశ్నలు సంచలనంగా మారాయి.

జగన్‌తో రామసుబ్బారెడ్డి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యింది. ఆ తర్వాత దీనిపై రామ సుబ్బారెడ్డి క్లారిటి ఇచ్చినా సరే జనం మాత్రం నమ్మలేదు. ఆయన పార్టీ మారడానికి ఇప్పుడు సిద్దమయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన రామసుబ్బారెడ్డి పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో వైసీపీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది.

ఈ నేపధ్యంలోనే నియోజకవర్గాల వారీగా బలమైన నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తుంది. రాజకీయ భవిష్యత్‌పై వైఎస్సార్‌సీపీ పెద్దల నుంచి భరోసా ఇవ్వడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఆయనకు నియోజకవర్గంలో బలం ఉంది. చంద్రబాబు ఎమ్మెల్సీ గా కూడా అవకాశం ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అయన ఆ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారాలి అనుకోవడం మాత్రం టీడీపీ కి దెబ్బే.

Read more RELATED
Recommended to you

Latest news