మార్చి 20 శుక్రవారం రాశిఫలాలు

-

మేష రాశి

కొద్దిపాటి వ్యాయంతో మీరోజువారీ కార్యక్రమాలను మొదలుపెట్టండి- మీగురించి మీరు హాయిగా అనిపించేలా పాటుపడడానికి, ఇదే సరియైన సమయం- దీనిని ప్రతిరోజూ, క్రమం తప్పకుండా ఉండేలాగ చూడండి, అలాగే, దానికి కట్టుబడి ఉండేలాగ ప్రయత్నించండి. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకు తుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. జీవిత భాగతస్వామి నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.
పరిహారాలుః కుటుంబ జీవితం లో శ్రేయస్సు పొందటానికి లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృషభ రాశి

అనవసరమైన టెన్షన్, వర్రీ మీమ్ జీవన మాధుర్యాన్ని పీల్చేసి, పిప్పిచేసి వదులుతాయి. వీటిని వదిలించుకొండి, లేకపోతే, అవి మీసమస్యను మరింత జటిలం చేస్తాయి. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. మీరు మీ ముఖ్యమైన పనులను పూర్తిచేసి మీకొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ, ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగము చేసుకోలేరు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తిస్థాయిలో జరగనుంది.
పరిహారాలుః గణేశ ఆలయం వద్ద గరికతో పూజిస్తే ఆర్థిక జీవితం కోసం మంచిది.

మిథున రాశి

గ్రహచలనం రీత్యా, అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ధ్యాస పెట్టాలి. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజు గా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలు తీసుకోలేననీ అది చాలా కష్టమని భావిస్తారు. ఈరోజు మీరొక స్టార్ లాగ ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చెయ్యండి. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.
పరిహారాలుః వృత్తిలో అభివృద్ధి చెందటం కోసం, ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి. గాయత్రీ మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

కర్కాటక రాశి

ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అను కూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. యువత వారిస్కూలు ప్రాజెక్ట్ ల గురించి సలహా పొందుతారు. రీ ప్రాజెక్ట్ ల గురించి సలహా పొందుతారు. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. ఈరోజు మీజీవితభాగస్వామితో గడపటానికి మీకుసమయము దొరుకుంటుంది. మీప్రియమైనవారు వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బితబ్బిబ్బుఅయిపోతారు. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాల వంటివన్నీ ఈ రోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి.
పరిహారాలుః విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

సింహ రాశి

ధ్యానం, యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు డబ్బు విలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మహిళా సహ ఉద్యోగుల సహకారం బాగా ఎక్కువ ఉంటుంది, మీకు పెండింగులో గల పనులను పూర్తి చెయ్యడంలో సహాయపడతారు. బాగా దూరప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చును. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.
పరిహారాలుః అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం విష్ణుసహస్రనామాలను చదివితే మంచిది.

కన్యా రాశి

మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. కుటుంబంతో సామాజిక గెట్-టుగెదర్, ప్రతిఒక్కరినీ మంచి మూడ్లో ఉంచుతుంది. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనుకావచ్చు.
పరిహారాలుః మంచి ప్రేమ జీవితాన్ని సాధించడానికి ఇంట్లో పసుపు రంగు పుష్పాలు కలిగిన మొక్కలు పెంచండి

తులా రాశి

చక్కని అహారాన్ని ఉప్పు పాడుచేసినట్లు, కొంత విచారం, అసంతోషం అవసరం- అప్పుడే, మీరు, అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. ముఖ్యమైన వ్యక్తులు, వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లైతే, దేనికొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమౌతారు. ఒక శుభవార్త అందే అవకాశమున్నది. అది మిమ్మల్నే కాదు, కుటుంబాన్నంతటినీ ఊపేస్తుంది. మీ ఆతృతను అదుపులో ఉంచుకొండి. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. ధైర్యంతోవేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. మీరు ఈరోజు ఎవరికిచెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటినుండి బయటకువెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్లినప్పటికీ కొన్నివేల ఆలోచనలు మీమెదడును తొలిచివేస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
పరిహారాలుః మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి ఇంటిలో తెల్ల పుష్పం పండే మొక్కలను వృద్ధి చేసుకోండి

వృశ్చిక రాశి

సమయానుసారంగా కొంత పనిచేయలేనితనం అంటే పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొంత సమస్యలను కలిగించవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పని తీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్నిసంపాదించగలరు,దీనికి కావాల్సింది మీమీద మాకునమ్మకము. మీ పరిస్థితులను, మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.
పరిహారాలుః మంచి ఆరోగ్యం కోసం, ఈశ్వర ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి

మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశ మున్నది మీరు మత్తుపానీయాలనుండి ఈరోజుదూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీవస్తువులను పోగొట్టుకొనగలరు. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్ నిక్ ప్లాన్ వేసుకొండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి, సాధారణంగా కలిగిన మందకొడితనం నుండి బయటకు తెస్తుంది. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
పరిహారాలుః వ్యాపార / పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచండి

మకర రాశి

ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నపటికీ ,కొన్ని కారణాలవలన మీరు ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇదిమీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు, తప్పవు- మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.
పరిహారాలుః మంచి ఆరోగ్యానికి మీ జేబులో ఎరుపు రుమాలు తీసుకువెళ్ళండి

కుంభ రాశి

మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చును. మంచిరోజులు కలకాలం నిలవవు. మనిషి పనులన్నీ అలల సవ్వడులవంటివి. అయితే ఇవి సుమధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి, గింజలు, మనం నాటిన విత్తనాలకి వచ్చిన ఫలాలే. ఈరోజు మీ చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. మీయొక్క సంతోషం, ఃఉషారైన శక్తి- చక్కని మూడ్- మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరాశిలో ఉన్నవిద్యార్థులు ఈరోజుమొత్తం ఫోనులకు అతుక్కుపోతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు.
పరిహారాలుః వ్యాధులు మరియు లోపాలను వదిలించుకోవడానికి 15 – 20 నిముషాలు (ఉదయాన్నే) రోజూ సూర్యకాంతి లో స్నానం చేయండి.

మీన రాశి

కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి మనసును మబ్బుక్రమ్మేలాచేస్తుంది. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.
పరిహారాలుః ఇంట్లో గంగాజలం చిలకరించడం ద్వారా కుటుంబంలో శాంతి మరియు ఆనందం కొనసాగించండి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news