ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మహిళలకు నెలకు 1500 రూపాయలు అందిస్తామని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ లో కీలకమైన “ఆడబిడ్డ నిధి” పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. త్వరలోనే వెబ్సైట్ కూడా సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది.

ఈ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున సంవత్సరానికి గాను రూ. 18,000 వారి ఖాతాలలో జమ చేస్తారు. బడ్జెట్ లో ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 3,300 కోట్లు కేటాయించింది. ఈ విషయం తెలిసి ఏపీలోని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.