బీఆర్ఎస్ కి దూరంగా ఉండటానికి కారణం వెల్లడించిన కవిత

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా ఎవ్వరికైనా అభిప్రాయభేదాలుంటాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత మంది బీసీ రిజర్వేషన్ పై ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్డినెన్స్ కాదన్నారు. అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. పార్టీ మీది అని చెబుతున్నారు.

kavitha

బీఆర్ఎస్ పార్టీతో డిస్టబెన్స్ లేదని కవిత తెలిపారు. తాను కేసీఆర్ కి రాసిన లేఖను కుట్ర పూరితంగా లీక్ చేసిన వారిని గుర్తించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అభిప్రాయ బేదాలే తప్ప నాకు పార్టీతో సమస్యలు లేవు. ఆ లెటర్ లీక్ చేసిందెవ్వరో పట్టుకునే వరకు పార్టీకి దూరంగా ఉంటున్నా.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా లేదా అనేది పార్టీయే చెప్పాలని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news