” వ్యాక్సీన్ విడుదల కాగానే ముందు అందించేది వాళ్ళకే ” జాన్సన్ అండ్ జాన్సన్ అధినేత ప్రకటన

-

రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగున్నప్పటికీ ఏ ఒక్క దేశం కూడా ఇప్పటి వరకూ కరోనా నిర్మూలనకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయింది. ఏ సంస్థ ఐతే దీని మీద మందుని లేదా వ్యాక్సీన్ నీ కనిపెట్టగలదో ఆ కంపెనీ పేరు, వ్యక్తుల పేర్లు చరిత్రలో చిర స్థాయి గా నిలిచిపోతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వారు కరోనా వ్యాక్సీన్ కి సంబంధించినంత వరకూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణం లో సరికొత్త సమరమే జరగబోతోంది. అవును జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కరోనా వ్యాక్సీన్ తీసుకుని రావడం అనేది అతిపెద్ద యుద్ధంగానే పేర్కొనాలి. ఒక వైరస్ కి మందు కనిపెట్టడం చిన్న విషయం కాదు. ఎన్నో సంవత్సరాల తరవాత కూడా ఎయిడ్స్ కి ఇంకా మందుని కనిపెట్టలేకపోయారు. అమెరికాకు చెందిన బయో మెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ కి, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కీ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.Johnson & Johnson to Begin Testing a Coronavirus Vaccine in Humans ...ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ తమ వ్యాక్సీన్ ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అంటూ ప్రామిస్ చేస్తున్నారు వేరు. అందరికంటే ముందుగా ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనా నేపధ్యం లో కష్ట పడుతున్న హెల్త్ వర్కర్ల కి ఇది అందిస్తాం అని తెలుపుతున్నారు. ” ప్రపంచం లోని అన్నీ ప్రభుత్వాలతో మేము కలిసి ముందుకి నడుస్తాము .. కేవలం యూరప్ లేదా అమెరికా మాత్రమే కాదు .. చైనా, సౌత్ కొరియా , జపాన్ , ఇండియా ఇలా ప్రతీ దేశం లో వ్యాక్సీన్ ల యొక్క అందుబాటు ఉంచుతాము ” అంటూ ఆ సంస్థ పెద్ద స్టాఫెల్స్ పేర్కొన్నారు.

 

న్యూ జెర్సీ లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ చిన్న పిల్లల సబ్బుల తయారీ సంస్థ గా మనందరికీ తెలుసు. ఈ సంస్థ అధిపతి స్టాఫెల్స్ తన రీసెంట్ ఇంటెర్వ్యూ లో మాట్లాడుతూ ” అందరికంటే ఈ వ్యాధి వలన ఎక్కువ రిస్క్ ఉన్న వ్యక్తులకే ఇది చెందాలి .. వాళ్ళే హెల్త్ కేర్ వర్కర్లు ” అంటూ చెపుకొచ్చారు.. డాక్టర్లు , నర్స్ లూ , హెల్త్ కేర్ వర్కర్ల కిందకి వస్తారు. ప్రస్తుతం వారే కరోనా పేషెంట్ లతో పోరాటం చేస్తున్నారు. అనేకమంది హెల్త్ కేర్ వర్కర్లు చనిపోతున్నారు కూడా. ఈ వ్యాక్సీన్ యొక్క ఖర్చు గురించి అడిగితే ఇప్పుడే చెప్పలేము అంటున్నారు ఆయన. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ని ఇప్పటికే పార్ట్నర్ ల సహాయం తో పెట్టము అనీ రిజల్ట్ బట్టీ తదుపరి అడుగులు ఉంటాయి అన్నారు. సెప్టెంబర్ కల్లా క్లినికల్ ట్రైల్స్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news