చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. భూమి మీద దాదాపు రెండు వందలకు పైగా దేశాలలో వ్యాపించి ఉన్న ఈ వైరస్ కొన్ని వేల మందిని బలి తీసుకుంది. కాగా కొన్ని లక్షల మంది ఈ వైరస్ తో పోరాడుతున్నారు. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో కట్టడి చేయడానికి చాలా దేశాలు ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేస్తూ లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. అటువంటి దేశాలలో భారత్ కూడా ఒకటి. ప్రస్తుతం భారత్ లో 21 రోజులపాటు అనగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉంది.అయితే ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధి దేనివల్ల వచ్చింది అని ఆరా తీస్తే గబ్బిలాల వల్ల వచ్చినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం హైదరాబాదులో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న తరుణంలో నగరంలో ఉన్న ప్రజలు కరోనా మీద కోపంతో గబ్బిలాలను టార్గెట్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఒకానొక టైములో చెట్లపై వేలాడుతూ గబ్బిలాలు కనిపించేవి. అయితే కరోనా వైరస్ దెబ్బకీ ఇప్పుడు చాలా వరకూ గబ్బిలాలు కనిపించకుండా పోయాయి.
కారణం చూస్తే హైదరాబాద్ వాసులంతా పెద్ద పెద్ద చెట్ల పై గబ్బిలాలు ఉన్నాయి అని అనుమానం వస్తే వెంటనే ఆ చెట్టు కింద పెద్ద మంట వేసి పొగ రాజేసి గబ్బిలాలకు ఊపిరాడకుండా అక్కడి నుండి పోయేటట్టు చేస్తున్నారు. దీంతో అలా వెళుతూ వెళుతూ చాలా గబ్బిలాలు ఆహారం లేక చనిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో చాలా వరకూ గబ్బిలాలు కనిపించకుండా పోయాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్ గబ్బిలాల వల్ల రాలేదని అది ఫేక్ న్యూస్ అని… కానీ అటువంటి వార్తల వల్ల చాలా వన్యప్రాణులు చనిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.