ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందా…? ప్రభుత్వంలో జగన్ మార్పులు చేయడానికి సిద్దమవుతున్నారా…? ఈ నాలుగు రోజులు సైలెంట్ గా ఉండి కొందరిని తప్పించడానికి గానూ ఆయన మార్గం సుగుమం చేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా ప్రభావం పెరుగుతున్నా సరే కొంత మంది మంత్రులు బయటకు రావడం లేదు అనే ఆగ్రహం జగన్ లో ఎక్కువగా ఉంది. దీనితో ఇద్దరు మంత్రులను పిలిచి ఆయన క్లాస్ కూడా పీకినట్టు వార్తలు వస్తున్నాయి.
వాళ్ళు అసలు సచివాలయం కి రావడం లేదని కీలక శాఖల అధికారుల వద్దకు వచ్చి అసలు ఏ సూచనలు ఇవ్వడం లేదని అధికారులు ఫోన్ చేసినా సరే వాళ్ళు స్పందించడం లేదు అనే సమాచారం జగన్ కి వెళ్ళింది. వాళ్లతో మాట్లాడిన జగన్ ఈ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయినా సరే వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. ఇక కొందరు కీలక శాఖల అధికారులు కూడా ఇప్పుడు బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు. రాజకీయంగా ఇది విమర్శలకు వేదికగా మారింది. దీనిపై ఎన్ని హెచ్చరికలు చేసినా సరే వాళ్ళు మారడం లేదు.
ఇటీవల కొంత మంది వైద్యులు మాస్క్ లు సహా ఇతర రక్షణ పరికరాల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసి విధుల నుంచి ఎస్మా ఉన్నా సరే తప్పుకున్నారు. దీనిపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ అధికారులను మొత్తం ఆరుగురు మంత్రులను తప్పించే ఆలోచనలో సిఎం ఉన్నారని అంటున్నారు. ఎన్ని విధాలుగా చెప్పినా సరే మారని వాళ్ళను, ప్రజలకు అసలు అందుబాటులో లేకుండా అధికారులకు స్థానికంగా సహకరించకుండా ఇంట్లోనే పరిమితం అయిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి జగన్ రెడీ అయినట్టు తెలుస్తుంది.