బాలయ్యకు విలన్ గా భూమిక…!

-

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లి అయిన మాజీ హీరోయిన్స్ హవా ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కీలక పాత్రల కోసం వాళ్ళను తీసుకుంటున్నారు దర్శకులు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు వాళ్ళను ఎంపిక చేస్తున్నారు. నదియా, భూమిక, టబూ, రమ్యకృష్ణ ఇలా కొందరు హీరోయిన్ లు ఇప్పుడు టాలీవుడ్ లో తమ ప్రభావం చూపిస్తున్నారు. నదియా హవా కాస్త తగ్గింది.

ఇప్పుడు భూమిక క్రమంగా సినిమాలు చేస్తుంది. బాలకృష్ణ సినిమా రూలర్ లో ఆమె కీలక పాత్ర చేసింది. నానీ సినిమా ఎంసిఏ లో కూడా కీలక పాత్ర ఒకటి చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఆమె పేరుని పరిశీలించడం మొదలుపెట్టారు. తాజాగా బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసే సినిమాకు ఆమెను విలన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ పాత్రలో కనపడుతుందని టాలీవుడ్ లో టాక్.

నటనకు ప్రాధాన్యత ఉండటం, బాలకృష్ణ సినిమా కావడం తో ఆమె మరో మాట ఆలోచించకుండా ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత రెండో షెడ్యూల్ షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్ లో ఇది 106 వ సినిమా. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఈ ఏడాది దసరాకు విడుదల చేస్తారు. మరి ఆమెకు అవకాశం వస్తుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news