వెనకెళ్ళిన ఆర్.ఆర్.ఆర్…ముందుకొచ్చిన ఆచార్య ..ఇది కదా అసలు ట్విస్ట్ అంటే ..!

-

ప్రస్తుతం మన టాలీవుడ్ తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం రణం రుధిరం’. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక రాజమౌళి రాం చరణ్, ఎన్.టి.ఆర్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటు చిత్ర పరిశ్రమ తో పాటు ప్రేక్షకులలోను భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో ఈ సినిమా బాహుబలి లా మరో భారీ పాన్ ఇండియా సినిమా అని గట్టిగా ఫిక్సైపోయారు.

 

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ అన్న ఒక స్పెషల్ వీడియో రెడీ అవుతుందని తాజా సమాచారం. అంతేకాదు చరణ్ వీడియో కంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఈ వీడిలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు సీన్స్ ని రివీల్ కాబోతున్నాయని తెలుస్తుంది. కాని మళ్ళీ ఫ్యాన్స్ కి నిరాశే అని ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తుండగా… 20121 జనవరి 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాని ఇప్పుడు ఈ సినిమా కి టెక్నికల్ ఇష్యూస్ బాగా తలెత్తాయట. ఈ సినిమాకి ఇంకా షూటింగ్ వర్క్ చాలా పెండింగ్ ఉండగా వీ.ఎఫ్.ఎక్స్, సీ.జీ.వర్క్ కంప్లీట్ అవదని తెలుస్తుంది. దాంతో ఆ డేట్ ని ఆచార్య సినిమా క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుందట. కాస్త అదే డేట్ కి ప్రేక్షకుల ముందుకు ఆచార్య సినిమాని తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టు కొరటాల అన్ని కార్యక్రమాలు నవంబర్ లోపు కంప్లీట అయ్యోలా నవంబర్ నుండి జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టేలా పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట. దీన్ని బట్టి చుస్తే ఆర్ ఆర్ ఆర్ వెనక్కి వెళ్ళి ఆ స్థానం లో ఆచార్య వచ్చి చేరబోతుందని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news