భారతదేశం ఆర్థిక సంస్కరణల లో అట్టడుగు స్థాయికి చేరుకున్న సందర్భంలో పీవీ నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాయి. భారత దేశాన్ని పరిపాలించిన ప్రధానుల లో తెలుగువాడు పీవీ నరసింహారావు. బహుభాషా పండితుడు అయిన పి.వి మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు దిగ్విజయంగా నడిపించి చరిత్ర సృష్టించాడు. అంతటి పేరు పొందిన పీవీ నరసింహారావు చిన్న కుమార్తె డాక్టర్ విజయ సోమరాజు ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం చేస్తోంది. అమెరికాలో విస్కాన్సిన్ సిటీలోని బిలాయిట్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అయిన డాక్టర్ విజయ ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్‌గా ప్రఖ్యాతిగాంచారు. అలాగే యూఐసీ యూనివర్సిటీలో అవుట్ స్టాండింగ్ టీచింగ్ అవార్డు గ్రహీతైన ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో క్లినికల్ ప్రొఫెసర్‌గా వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు. ప్రజెంట్ అగ్రరాజ్యం అమెరికా అని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు రోజుకి 12 గంటల నుండి 14 గంటల వరకూ పీపీఈ సూట్ ధరించి పీవీ నరసింహారావు రెండో కుమార్తె రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయులకు ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక సందేశాన్ని తెలిపారు. సామాజిక ద్వారం పాటించడం ద్వారా మాత్రమే కరోనా పై విజయం సాధిస్తామని ఆమె గట్టిగా చెప్పారు. దానికి మించి మరొకటి లేదని స్పష్టం చేశారు. గత 30 సంవత్సరాల నుండి డాక్టర్ విజయ సోమరాజు ఆమె భర్త అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో విజయ సోమరాజు చెప్పిన టిప్ కి చాలామంది నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పోరాడుతున్నది ఎక్కువగా భారతీయులు అని అంటున్నారు. ప్రపంచ దేశాలను రక్షించడానికి భారతదేశం నుండి ఎక్కువగా కరోనా వైరస్ విరుగుడు డ్రగ్ సప్లై అవుతుందని నెటిజన్లు అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే ఈ కరోనా వైరస్ నుండి ప్రపంచ దేశ ప్రజలను కాపాడుతున్నది ఎక్కువగా భారతీయులు అని సగర్వంగా చెప్పవచ్చు అంటూ పీవీ నరసింహారావు కుమార్తె ఇచ్చిన స్పీచ్ కి సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.