కర్నూలు జిల్లాపై పవన్ కీలక వ్యాఖ్యలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వెయ్యికి చేరువలో ఉన్నాయి. హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు అంటే చాలు ఇప్పుడు జనాలకు ఎన్నికల ఫలితం కన్నా ఎక్కువగా కంగారు ఉంటుంది. ప్రతీ రోజు కూడా హెల్త్ బులిటెన్ లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. నాలుగు రోజుల్లో 50 కేసులు తక్కువ వచ్చిన రోజు ఏదీ కూడా లేదు. ఇక కర్నూలు జిల్లాలో పరిస్థితి ఆందోళనలో ఉంది.

రోజు రోజుకి అక్కడ కేసుల తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఒక్క కర్నూలు జిల్లాలోనే 261 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కర్నూలు కరోనా వ్యాధి వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్నారు ఆయన. ప్రభుత్వాన్ని విమర్శిచండం నా ఉద్దేశం కాదన్న పవన్… ప్రభుత్వానికి సూచనలు కూడా చేసారు.

ప్రభుత్వ సరైన వ్యూహంతో కరోనాను కట్టడి చేయకుంటే కర్నూలులో పరిస్థితి చేదాటిపోయే అవకాశముందని అన్నారు. బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు లేఖ రాశారని… కర్నూలో కరోనాను కట్టడి చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని చెప్పారని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరోనా నివారణ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆయన హితవు పలికారు. జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇప్పటి వరకు జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news