గ్రామీణ వ్యర్థాలతో కంపొస్ట్ ను ఎలా తయారీ చెయ్యాలి?

-

మనం నిత్యం ఉపయోగించే వాటిలో సగం వ్యర్థాలు ఉంటాయి.. వాటిని బయట పడేయ్యకుండా ఎరువుగా చెయ్యడం వల్ల మంచి లాభాలు ఉన్నాయని అంటున్నారు.వ్యర్థాలను ఉపయోగించి వివిధ పద్ధతులలో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు.రోజు వారి ప్రతి మనిషి తను వినియోగించుకునే పదార్ధాల ద్వారా లభించే చెత్త, కలుపు మొక్కలు పైరు మొళ్ళు పొట్టు లేదా ఊక పైర్ల వ్యర్థలైన చెరకు ఆకు, పత్తి కంప, వేరుశెనగ పొట్టు ఇతర వ్యర్థాలు పశువుల మూత్రంతో నానినా మట్టి పశువుల విసర్జనలు మొదలైనవి..

ఈ కంపొస్ట్ ఎరువును ఎలా తయారు చెయ్యాలి ఇప్పుడు తెలుసుకుందాం..

సుమారు ఆరు అడుగుల లోతు పన్నెండు అడుగుల వెడల్పు మరియు 50 అడుగుల పొడవు గల గుంటలో వివిధ గ్రామీణ ప్రాంత వ్యర్థాలను ఒక అడుగు మందంలో పరచుకోవాలి. వ్యవసాయ వ్యర్థాలు అయినా కలుపు మొక్కలు పైరు,మోళ్ళు పొట్టు లేక ఊక పైర్ల వ్యర్ధాలు అయిన చెరకు ఆకు, ప్రత్తి కంప, వేరుశనగ పొట్టు ఇతర వ్యర్ధాలు పశువుల మూత్రం తో నానినా మట్టి పశువుల విసర్జనలు దీనిలో వాడుకోవచ్చు. తరువాత పచ్చి పెడను స్లరీల కలుపుకొని మొదటి పోరపై చల్లాలి..

అదే విధంగా ప్రతి పోరలోని వ్యర్థాలను పేడ నీటితో బాగా కడిగిన తర్వాత నేల మీద 5 అడుగులు వచ్చే వరకు క్రమ పద్దతిలో వ్యర్థాలను పరచుకుంటూ వచ్చి ఆ తర్వాత గుంతను మట్టితో కప్పుతారు.మూడు నేలల తర్వాత కుళ్ళిన వ్యర్థాలను బయటికి తీసి, అవసరం మేరకు నీటితో తడిపి మళ్ళీ కప్పుతారు. మూడు నేలల తర్వాత కృళ్లిన వ్యర్థాలను బయటకు తీసి ఎరువుగా వాడుతారు. పశువుల పేడ మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫాట్ వేసిన కుళ్ళే ప్రక్రియ మరింత వేగం అవుతుంది..సహజ పద్దతులలో తయారు చేసిన ఈ ఎరువు వల్ల మొక్కలకు మంచి పోషణ లభిస్తుంది..అంతేకాదు ఈ ఎరువులను ఉపయోగించి పండించిన కాయ కూరలను తినడం వల్ల ఎటువంటి హానీ జరగదు..

Read more RELATED
Recommended to you

Latest news