ఈ పంట సాగుకు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ..?ఏ సీజన్‌లో అయినా డిమాండే..

-

వ్యవసాయం అంటే..పెట్టుబడితో కూడుకున్న పని.. ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినా.. లాభం వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. అతి తక్కువ పెట్టుబడి పెట్టి.. ఎక్కువ లాభాలు కావాలి అనుకుంటున్నారా..? అయితే ఈ పంట చాలా మేలైనది.. అది కూడా మీరు చేస్తున్న వ్యవసాయం మధ్యే ఈ మొక్కలు పెంచుతూ.. రెండు చేతులా లాభాలు సంపాదించుకోవచ్చు….

సాధారణంగా గులాబీ పూవులు అంటే ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు. పూలల్లో రారాజు గులాబీ.. ఏ పూజకైనా, ఏ శుభకార్యానికైనా.. ఎక్కువగా గులాభిలనే ఉపయోగిస్తారు. అంతేకాదు రైతులకు లాభాలు కూడా అందిస్తోంది. ఈ గులాబీలను ఒక్కో రైతు ఒక్కో రకంగా సాగు చేస్తారు. అంటే కొందరు 5 ఎకరాల్లో సాగు చేస్తే.. మరికొందరు.. 3 ఎకరాల్లో చేస్తారు. అలా తీసుకుని బాగా కలిసే లాగా దున్నుకోవాలి. మొక్కలు ఒకటిన్నర అడుగుల నుండి రెండు అడుగుల వెడల్పు నిర్మించాలి.

మొక్కకు మొక్కకు కాస్త దూరంగా ఉంచి నాటుతారు. అలా ఒక్కో మొక్క నుంచి ఒక్కో మొక్కకు మూడు అడుగులు వరుస నుండి ఆరడుగుల వ్యత్యాసంలో గులాబీ మొక్కలు నాటుకోవాలి. మొక్క నాటిన రెండు నెలల నుండే గులాబీ పూలు పూస్తాయి. పూలు మొగ్గలను ఆరు నెలల వరకు తెంపుతూ ఉండాలి. ఇలా చేయడం వలన చాలా త్వరగా మొక్క బలంగా తయారవుతుంది.

తర్వాత పూలు కోతకు వచ్చాక పూలను మార్కెట్‌కి పంపిస్తారు. అయితే పూలధర ప్రస్తుతం స్వాములు మాలలు వేసుకునే సమయం కాబట్టి…పూల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. దానివల్ల రైతులకు కాస్త ఎక్కువగానే గిట్టుబాటు ధర వస్తుంది. పండగలు అప్పుడు, పెళ్లిళ్లు అప్పుడు పూలకు ధర ఎక్కువగానే ఉంటుంది.

నెలకు రైతుకి గడ్డి మందు, పురుగు మందులు అని 10 వేల వరకు ఖర్చు అవుతుంది కానీ నెలకు వారికి వచ్చే లాభం 70 వెల నుండి దాదాపుగా 2 లక్షలు వరకు సంపాదించవచ్చు. ఈ పంట ఒక్కసారి వేస్తే ఎనిమిది సంవత్సరాల వరకు ఉంచుతారు. అయితే ఎనిమిది నెలల వరకు పూలు కాపు వస్తు ఉంటుంది. ఆ తర్వాత ఆ గులాబి మొక్కలను కత్తిరించి వాటికి చిగురు వచ్చేలాగా పంటకు నీరు పెడుతూ, మందులు చల్లుతారు.

వీటికి ఎంత లాభం వస్తుందో అలాగే పంటకు తెగుళ్లు వచ్చినప్పుడు అంతే ఎక్కువగా నష్టపోతుంటారు. కాబట్టి అవి రాకుండా జాగ్రత్తపడాలి. సమయానికి మందులు కొట్టాలి. తర్వాత పూలు కోతకు వచ్చాక పూలను మార్కెట్‌కి పంపిస్తారు అయితే.. పూలధర ప్రస్తుతం స్వాములు మాలలు వేసుకునే సమయం కాబట్టి. పూల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి దానివల్ల రైతులకు ఎక్కువగానే గిట్టుబాటు ధర వస్తుంది. పండగలు అప్పుడు,పెళ్లిళ్లు అప్పుడు పూలకు ధర ఎక్కువగానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news