మొక్క జొన్న సాగులో ఈ విషయాలను గమనించాలి..

-

అధిక లాభాలను ఇస్తున్న పంటలలో ఒకటి మొక్క జొన్న కూడా ఒకటి..మన రాష్ట్రంలో ఈ పంటను వర్షాధార పంటగా చెప్పవచ్చు..ఖరీఫ్, రభీల లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపికండె రకంగాను మరియు కాయగూర రకంగాను సాగుచేయబడుతుంది..

సుమారు 5.3 లక్షల హెక్టార్లలో మరియు నీటి పారుదల క్రింద సుమారుగా 3.3 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వర్షాధారం క్రింద ముఖ్యముగా మెదక్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌, జిల్లాలలో అధిక సాగులో ఉన్నది. నీటి పారుదల క్రింద గుంటూరు, పశ్చిమ గోదావరి, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలలో ఎక్కువ సాగులో ఉన్నది..మొక్క జొన్న వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి..అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువే..

మొక్కజొన్నలో పూర్తిగా కొలెస్ట్రాల్ మరియు సోడియం ఉండదు, కాబట్టి కార్న్‌ఫ్లోర్‌తో చేసిన వంటకాలను గుండె జబ్బులు ఉన్నవారు సురక్షితంగా తీసుకోవచ్చు. ఇంకా, డైటరీ ఫైబర్స్ మరియు విటమిన్ B3 లేదా నియాసిన్ యొక్క సమృద్ధి HDL స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది..ఈ పంట సాగులో గుర్తించుకోవాల్సిన అంశాలు..

ఈ సీజన్ లో ఒక పదును వర్షం కురిసిన తర్వాత మాత్రమే ఈ పంటను విత్తుకోవాలి..ఖరీఫ్లో వర్షాధారం క్రింద మొక్కజొన్నలో అంతరం పెసర లేదా మినుము వేసుకోవాలి.ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని, 60×20 సెం.మీ., ఎడమలో విత్తుకొని 33,333 మొక్కలు ఉండేలా చూడాలి.కాండం తొలుచు పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్6. మి.లీ., ఒక లీటరు నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10-12 రోజులకే పిచికారి చేయాలి.విత్తిన 40-45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా. చూడాలి.పైపాటుగా ఎరువులు వేసినప్పుడు నేలలో తేమ ఉండేలా చూడాలి..మొక్కజొన్న గింజ పట్టే సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news